కొనియాడ తరమే నిన్ను కోమల హృదయా

కొనియాడ తరమే నిన్ను కోమల హృదయా

కొనియాడ తరమే నిన్ను / కోమల హృదయా
కొనియాడ తరమే నిన్ను
తన రారు దినకరుఁబెను తారలను మించు
ఘన తేజమున నొప్పు కాంతిమంతుడవీవు

1•
కేరుబులు సెరుపులు/మరి దూత ఘణములు
నురుతరంబుగ గొలువ/నొప్పు శ్రేష్ఠుడ నీవు ॥కొని॥

2•
సర్వలోకంబుల/బర్వు దేవుడ వయ్యుఁ/ నుర్వి
స్త్రీ గర్భాన/నుద్భవించితి వీవు ॥కొని॥

3•
విశ్వమంతయు నేలు/వీరాసనుడవయ్యు
పశ్వాళితో దొట్టిన్/పండి యుంటివి నీవు ॥కొని॥

4•
దోసంబులను మడియు/దాసాళి గరుణించి
యేసు పేరున జగతి/కేగుదెంచితి నీవు ॥కొని॥

5•
నరులయందున గరుణ/ధర సమాధానంబు
చిరకాలమును మహిమ/
పరగజేయుదు వీవు॥కొని॥

6•
ఓ యేసు పాన్పుగ/నాయాత్మ జేకొని
శ్రేయముగ బవళించు/శ్రీకర వరసుత ॥కొని॥

రచన: పంతగాని పరదేశి

Leave a Comment