కీర్తించి కొనియాడి ఘనపరతును
కీర్తించి కొనియాడి ఘనపరతును/
స్తోత్రించి స్తుతియించి నిను పాడెదన్
అ. ప:
యేసయ్య హల్లెలూయ నా /
యేసయ్యా హల్లెలూయా
ఆరాధన స్తుతి ఆరాధనా /
ఆరాధనా ఘన ఆరాధనా
1•
దేవాది దేవుడవు పరలోకమును వీడి
మానవ రూపాన్ని ధరియించినావు -2
రాజులకు రాజువు ప్రభువులకు ప్రభుడవు
నీవే నా రక్షణ విమోచకుడా ॥ యేసయ్య॥
2•
నన్నెంతగానో ప్రేమించినావు
నీ ప్రాణమును అర్పించినావు -2
నా ప్రాణనాధుడవు ఆధార బూతుడవు
నీవే నా రక్షణ విమోచకుడా ॥యేసయ్యా॥
3•
ఆశ్చర్యకరుడవు ఆలోచనా కర్త
బలవంతుడైనా మా దేవుడా -2
నిత్యుడగు తండ్రీ – సమాధాన కర్తా
నీవే నా రక్షణ, విమోచకుడా ॥యేసయ్యా॥