కల్వరిలోని కరుణ ఇదే గాయముల్ చూడుము

కల్వరిలోని కరుణ ఇదే గాయముల్ చూడుము

కల్వరిలోని కరుణ ఇదే
గాయముల్ చూడుము
ప్రభుయేసు నీ కొరకై
కష్టముల్ సహించెను

అ. ప:
విలువైన రక్తము నీ కొరకే
పక్క గాయముల్ కారుచుండె
విలువైన వానిగ చేయన్
నన్ను వెల యిచ్చి విమోచించెన్

1•
వెండి బంగారం ఈ లోక జీవితము
సాటికావా ప్రేమకు
తల్లికన్నా ప్రేమించెను
తన ప్రాణమర్పించెను

2•
నా కొరకై కల్వరిలో
శ్రమలు అనుభవించెన్
తండ్రీ నీదు ఈ ప్రేమనే
తలచుచు సేవచేతున్

3•
మన చింతలన్ భారములన్
నిందలన్ భరించెను
త్రోసివేయబడి వ్రేలాడెన్
నిత్యజీవమివ్వను

4•
నరమాత్రుని తలచుటకు
విచారించుటకు
ఏపాటివారు మంటివారు
దేవా నీదు ప్రేమయే

Leave a Comment