కల్వరిలో జీవమిచ్చెన్ నీ పాపములను తొలగించుటకై

కల్వరిలో జీవమిచ్చెన్ నీ పాపములను తొలగించుటకై

కల్వరిలో జీవమిచ్చెన్ (2)
నీ పాపములను తొలగించుటకై
నీదు సిలువన్ మోసెనేసు

1•
చెమటయు రక్తముగ అత్మల వేదనను
పొందెన్ యేసు నీ కొరకే
తండ్రీ… నీ చిత్తం సిద్దించుగాక అనిపల్కెను

2•
శిరస్సున ముళ్ళ కిరీటం
ఎర్రంగి ధరించెను
నిందలన్ని నీకై భరించెనె
కొట్టిరి యేసుని కొరడాలతో ఘోరముగ

3•
పరిశుద్ధ దేవుడు మహిమనంతయు వదలే
నీ … సిలువలో వ్రేలాడెను
పాపమున్ తొలగించి నీతి మంతులుగ మార్చెను.

4•
కాళ్ళలో చేతులలో రక్తము కారుచుండె
నీ…. దు రోగములు మోసెను
స్వస్థత కలుగును ఆయన గా యములచే

5•
ఎన్నియో కష్టములు నిన్ను రక్షించుటకు
త్యాగ జీవితమును చూపెను
నిత్యము ఆయనను వెంబడించి జీవించుము

Leave a Comment