కల్పనా కథ కాదు నిజము కనుల ముందే జరిగెను
కల్పనా కథ కాదు నిజము /
కనుల ముందే జరిగెను
ఏసునాథుని చరితము నిజము
నిజము నిజము నిజము ఆ ఆ ఆ ఆ……
1•
అది యెరుషలేము నగరము /
ఆసియాలో భాగము
అదిగో! అల్లదిగో! బేత్లహేము /
పశుల పాకలో ప్రసవము ॥కల్పనా॥
2•
అవి బేత్లహేము పొలములు /
గొర్రెలు మేపు స్థలములు
అదిగో! అల్లదిగో! దేవ దూతలు!
ఇదిగో ఇదిగో ఇమ్మానుయేలు॥కల్పనా॥
3•
ప్రభువు యేసు జననము /
ప్రవచనాల సారము
అదిగో! అల్లదిగో! తూర్పు జ్ఞానులు /
ఇదిగో ఇదిగో వారి కానుకలు ॥కల్పనా॥
రచన: బ్ర. యం. టైటస్ దేవదాస్