కాపాడు కరములలో నన్ను కాపాడును

కాపాడు కరములలో నన్ను కాపాడును

కాపాడు కరములలో నన్ను
కాపాడును కృపతో యేసు
హల్లెలూయ పాడి పాడి
అలలను దాటెదను నేను
నమ్మిరా-యేసుని-నమ్మిరా యేసుని

1•
నిందలు పోరాటములలో
నిత్యము నన్నాదుకొనెను
ప్రేమ ధ్వజము – ఎగురు చుండగ
ప్రియుని కొరకు జీవించెదను

2•
పర్వతములు తొలగునట్లు
ప్రభువు నిన్ను – పట్టుకొనెను
పక్షిరాజు వలె – బలము నొంది
కనిపెట్టుకొని ఎగిరెదవు

3•
అంజూరపు చెట్లు పూయకున్నను
ఫలములు లేకుండినను
ప్రభువు కొరకు కనిపెట్టు వారు
అవమానముల నొందరు

Leave a Comment