జయధ్వజము చేపట్టెదము మనము
జయధ్వజము చేపట్టెదము /
మనము వీరనడక నడచెదము
వరదలాగా సైతానొచ్చినా /
ఆత్మ తానే ధ్వజమునెత్తును
జంకకు నా కుమారుడా,
నీవు జంకకు నా కుమార్తె
1•
అడవియైనా మెట్టయైనను /
ప్రభువు వెనుక నడిచెదము
నాగలిపై చెయ్యి పెట్టాము /
మనము వెనుక తిరిగి చూడము ॥జయ॥
2•
వేలాది హింసలొచ్చినా / రావుదగ్గరికి రావు
ఆత్మ ఖడ్గమున్నది / దిగులు లేదు /
భయము లేదు ॥జయ॥
3•
గొల్యాతు నతమార్చెదము /
యేసుని నామమందు
విశ్వాస కేడెముతో /
సాతానును జయించెదము ॥జయ॥