జన్మించెను భువియందున రారండి కీర్తింతుము

జన్మించెను భువియందున రారండి కీర్తింతుము

జన్మించెను భువియందున /
రారండి కీర్తింతుము
జగమంతయు ఉదయించెను /
ఆ విభుని సేవింతుము

1•
పరలోక సైన్యమంత ప్రణుతించె ఆ యేసుని
సమాధానమును కోరిరి స్తోత్రము చెల్లించిరి
॥జన్మించెను॥

2•
సేవించుటకు వచ్చిరి తూర్పునుండి జ్ఞానులు
సంతసించిరి గొల్లలు పూజింపను వచ్చిరి
॥జన్మించెను॥

3•
పాపాలను పరిహారంప పరలోకం విడిచివచ్చే
దాపు చేరిన వారికి కలుగును మోక్షభాగ్యం
॥జన్మించెను॥

Leave a Comment