జైజై ప్రభు యేసుకు జైజై ప్రభు యేసుకు
జైజై ప్రభు యేసుకు / జైజై ప్రభు యేసుకు
మనలను రక్షింప వచ్చె జగతికి
ప్రభువును స్తుతియించుడి
అహహహహ…… హల్లెలూయ
ఓ హో హో హో హో – హోసన్నా
ల లాలాలాలాలా హల్లెలూయా ఆమేన్
1•
తన రక్తముతో మన ప్రతి పాపము /
కడిగి వేసి
పవిత్ర పరచి దేవుని కొరకు /
రాజ్యముగా జేసెను ॥జై॥
2•
తిరిగి వచ్చును మన ప్రభుయేసు
మనము వెళ్లెదము
మేఘములపై తనతో
కూడ మహిమతో ఉండుటకు ॥జై॥
3•
యేసే ప్రభువని నీ హృదయములో /
విశ్వసించిన యెడల
ఈ గొప్ప రక్షణ భాగ్యము /
నీకు ఉచితముగా దొరుకున్ ॥జై॥