హేతువేమి లేదు నన్ను ప్రేమించుటకు

హేతువేమి లేదు నన్ను ప్రేమించుటకు

హేతువేమి లేదు నన్ను / ప్రేమించుటకు
బీదనైన నాలో / ఏమి కంటివి దేవా

1•
నాదు పాపము / దోషమే కదా
సిలున మోసినట్టి కారణం
నీదు పావన రక్తముచే కొంటివి నన్ను

2•
నాదు రోగము / శాపమే గదా
సిలువ మోసినట్టి కారణం
నీదు గాయములలో నన్ను / బాగు చేసితివే

3•
నాలో నుండిన మృత్యుభయమేగా
సిలువ మోసినట్టి కారణం
నీదు మరణం ద్వారా / జీవమొసగితివే

4•
వధువుగా నన్ను చూచుటయేగా
సిలువ మోసినట్టి కారణం
అంతులేని ప్రేమను నేను / మరువను ప్రియా

5•
సీయోనులో / నన్ను నిల్పుటకేగా
సిలువ మోసినట్టి కారణం
ప్రాణ నాధా / నీ ముఖము చూడ వేచియుంటిని

Leave a Comment