హల్లేలూయా స్తుతిగీతం ఎల్లప్పుడు ప్రభుకే
హల్లేలూయా స్తుతిగీతం / ఎల్లప్పుడు ప్రభుకే (2)
హల్లేలూయా (4)
1.
యెరికో గోడలు కూల్చిన దేవుని
నిత్యము స్తుతించెదము
సింహాళ్ళ నోళ్ళను మూసిన దేవుని
మానక స్తుతించెదము ॥హల్లేలూయా॥
2.
పాప విమోచన ఇచ్చిన దేవుని
నిత్యము స్తుతించెదము
పరిశుద్ధాత్మను ఇచ్చిన దేవుని
మరువక స్తుతించెదము ॥హల్లేలూయా॥