ఘోరపాపిని దేవా చేర బిలిచినావా

ఘోరపాపిని దేవా చేర బిలిచినావా

ఘోరపాపిని దేవా / చేర బిలిచి నావా
కోరి కలువరి జేర / భారములు దీరె

1•
దారి తప్పిన గొర్రెను నేనే /
జారిపోయిన నాణెము నేనే
దూర మరిగిన తనయుడనై /
దొరికితి నీకే ప్రభువా

2•
పాపము నన్ను పట్టుకొనెను /
శాపములన్ని చుట్టుకొనెను
పాపంబై నా శాపమువై కృపతో విడిపించితివే

3•
లోకము లోతుగ లొంగదీయు /
లోలోపలనను క్రుంగజేయు
మేకులతో వ్రేలాడుచును పై కాకర్షించితివే

4•
యుగ దేవత పగబూని నాపై /
ఎగబడి యెంతో వేధింపగను
రగిలే పొగల కాహుతియై /
రక్షించితివే ప్రభువా

5•
కమిలిన మోముపై నుమియగను /
కుమిలిన వీపుపై దున్నగను
శ్రమలే ఖడ్గ జ్వాలలుగా /
క్షమ గాయము లాయెనుగా

6•
దోసము కడిగి వేసితి వహహా /
మోసములడిగి మోసితి వహహా
యేసు ప్రభో నీ రక్తములో /
యెన లేని ప్రేమములో

Leave a Comment