గాలి సముద్రపు అలలచే నేను
గాలి సముద్రపు అలలచే నేను
కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు
ఆదరించెను నీ వాక్యము/ఆదుకొనెను
నీ హస్తము హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ
1•
శ్రమలలో నీవు నాకు తోడుంటివి
మొఱ్ఱపెట్టగా నా మొఱ్ఱ వింటివి
ఆదుకొంటివి నన్ను ఆదుకొంటివి
నీ కృపలో నన్ను బ్రోచితివి
2•
వ్యాధులలో నిన్ను వేడుకొనగా
ఆపదలో నిన్ను ఆశ్రయించగా
చూపితివి నీ మహిమ నాకు
కొనియాడెదము ప్రియ యేసును
3•
నీతట్టు రమ్మని పిలిచితివి
నేను నీకు తోడుగ నున్ననంటివి
నేను నిన్ను ఆత్మలో తెలుసుకొంటిని
నీవేనాశ్రయమని ఎరిగితిని