ఇళ్ళలోన పండగంట కళ్ళలోన కాంతులంట

ఇళ్ళలోన పండగంట కళ్ళలోన కాంతులంట

ఇళ్ళలోన పండగంట కళ్ళలోన కాంతులంట
ఎందుకే ఎందుకే కోయిల /
చెప్పవే చెప్పవే కోయిల
మల్లెపూల మంచుజల్లు /
మందిరాన కురిసె నేడు కోయిల ॥ఎందుకే।
అర్థరాత్రి కాలమందు వెన్నెల /
ఆహా – అవతార పురుషుడంట వెన్నెల/
ఓహో అవతరించినాడమ్మ వెన్నెల/
ఆహా ఈ అవనిలోనమ్మ వెన్నెల
ఓహో ల… ల… ల… ల

1•
ఏ ఊరు ఏ వాడ ఏదేశాన పుట్టినాడే కోయిల/
చెప్పవే చెప్పవే కోయిల
యూదా దేశమున వెన్నెల ఆహా/
బెత్లహేము నగరిలో వెన్నెల ఓహో
రాజులకు రారాజు వెన్నెల /
ఈ బాలుడు పుట్టినాడే వెన్నెల ఆహా

2•
ధూప దీప హారతులతో వచ్చినారు
ఎవ్వరే కోయిల – చెప్పవే చెప్పవే కోయిల
రూపు చూపు చూడలేక వెన్నెల/
తూర్పుదేశ జ్ఞానులమ్మ వెన్నెల
తారదారి చూపగా వెన్నెల /
కోరి కొలువ వచ్చినారే వెన్నెల

Leave a Comment