ఇది శుభోదయం క్రీస్తు జన్మ దినం
ఇది శుభోదయం / క్రీస్తు జన్మ దినం
ఇది లోక కళ్యాణం / మేరి పుణ్య దినం
1•
రాజులనేలే రారాజు వెలసెను/
పశువుల పాకలో
పాపుల పాలిట రక్షకుడు నవ్వెను /
తల్లి కౌగిళిలో
భయము లేదు మనకిలలో
జయము జయము జయమహో ॥ఇది॥
2•
గొల్లలు, జ్ఞానులు ఆనాడు
ప్రణమిల్లిరి భయభక్తితో
పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి /
ప్రేమ దీప్తితో
జయ నినాదమే భువిలో
ప్రతిధ్వనించెను ఆ దివిలో ॥ఇది॥