ఈ నూతన వత్సరములో మన ప్రభుని స్తుతింతుము
ఈ నూతన వత్సరములో
మన ప్రభుని స్తుతింతుము
హల్లెలూయ స్తోత్రములు (2)
ప్రభు యేసుకే స్తోత్రములు
1•
గత వత్సరము మమ్ముకాచితివే
నీ రెక్కల క్రింద దాచితివే,
కృతజ్ఞతతోనే పాడెదను
2•
ఈ నూతన యేడులో మమ్ములను
మీ నూతన కృపతో నడిపించుము
హల్లేలూయా అని పాడెదను