దూత పాట పాడుడీ రక్షకున్ స్తుతించుడి
దూత పాట పాడుడీ-రక్షకున్ స్తుతించుడి
ఆ ప్రభుండు పుట్టెను-బేత్లహేము నందునన్
భూజనంబు కెల్లను – సౌఖ్య సంభ్రమాయెను,
ఆకాసంబునందున – మ్రోగు పాట చాటుడీ
దూత పాట పాడుడీ – రక్షకున్ స్తుతించుడీ
1•
ఊర్థ్వలోకమందున – గొల్వగాను శుద్ధులు
అంత్యకాలమందున – కన్యగర్భమందున
బుట్టినట్టి రక్షకా – ఓ యిమ్మాను యేల్ ప్రభో
ఓనరావతారుడా – నిన్ను నెన్న శఖ్యమా!
దూత పాట పాడుడీ – రక్షకున్ స్తుతించుడీ
2•
రావే నీతిసూర్యుడా – రావే దేవపుత్రుడా
నీదు రాకవల్లను – లోకసౌఖ్య మాయెను
భూనీవాసులందరు – మృత్యుభీతి గెల్తురు
నిన్ను నమ్మువారికి – ఆత్మశుద్ధి కల్గును
దూత పాటపాడుడీ – రక్షకున్ స్తుతించుడీ
రచన : చార్లెస్ వెస్లీ