దేవాది దేవుడు మహోపకారుడు మహాత్మ్యము
దేవాది దేవుడు మహోపకారుడు /
మహాత్మ్యము గల మహారాజు
ప్రభువుల ప్రభువు రాజుల రాజు /
ఆయన కృప నిరంతరముండును
1.
సునాద వత్సరము / ఉత్సాహ సునాదము
నూతన సహస్రాబ్ది నూతన శతాబ్దము /
ఉత్తము దేవుని గానములు
2.
యుగములకు దేవుడవు /
ఉన్నవాడ అనువాడవు
జగమంతా యేలుచున్న జీవాధిపతినీవే /
నీదు క్రియలు ఘనమైనవి
3.
అద్వితీయ దేవుడవు / ప్రభువైన యేసుక్రీస్తు
మహిమ మహాత్యములు /
సర్వాధిపత్యములు
సదా నీకే కలుగును గాక
రచన: మన్నామినిస్ట్రీస్