దేవ దేవుని స్తుతించెదము దేవుని కృప పొందెదము
దేవ దేవుని / స్తుతించెదము
దేవుని కృప / పొందెదము
ఒకే మనసుతో / ప్రభునామమును
స్తుతులు చెల్లించి / పొగడెదము.
పల్లవి:
హల్లెలూయ దేవునికే / హల్లెలూయ ప్రభువునకే
హల్లెలూయ పరిశుద్ధునికే / హల్లెలూయ రాజునకే
1.
మా పాదములు / జారకుండ
మా నడతలు / స్థిరపరచు
కను పాపపలె / కాపాడుము
కృపతో నిత్యము / నడిపించుము ॥హల్లెలూయ॥
2.
దేవనీదు / సముఖమందు
నిత్యము యిచ్చి / నడిపించుము
సాతాన్ను నిత్యము / జయించెదము
దేవ బలముతో / నింపునన్ను ॥హల్లెలూయ||
3.
బ్రతుకు / దినములన్నిటిలో
కృపక్షేమమువెంట వచ్చును
దైవ వాక్యంకు / లోబడెదం
దైవరూపంపొందెదము ॥హల్లెలూయ॥
4.
అనుదినము / ప్రభువు యేసు నాకు
ఆశ్రయందుర్గమై యుండును
కలిమిలేమి / ఏ స్థితిలో
నాదు ఆశ్రయం / యేసయ్య ||హల్లెలూయ||