దైవ రూపముగ మారి దేవునితో నుందును నేను

దైవ రూపముగ మారి దేవునితో నుందును నేను

దైవ రూపముగ మారి /
దేవునితో నుందును నేను, దేవునితో నుందును

1•
ఆ దినము సమీపించును /
అతి త్వరలో నెరవేరును
మంచి రూపము వదిలి నేను /
దైవ రూపం పొందెదను

2•
మట్టిగుడార మెల్లపుడు / బలహీనమై నశించునది
చేతులతో చేయబడని /
నిత్య గృహములో జీవించెదన్

3•
సొమ్మసిల్లెడి మనుష్యుడు /
శోధనలో బలము నొందన్
ఆదరించెడి ఆదరణ కర్త /
అత్మనాలో నివసించును

4•
ముద్రించెను ఆత్మతోను / ఆయత్తమై చేరుటకు
జీవము నాదు క్రీస్తేసు / చావు నాకు ఆదాయము

5•
కాచుకొని ప్రార్థించు / పక్షి వలె పైకెగిరి
జీవ యాత్ర చేసి ముగించి /
జీవ కిరీటం పొందెదను

6•
త్రిత్వములో ఒకడైనా /
ప్రభువును ముఖాముఖిగ దర్శించుటకు
నా హృదయము / వాంఛతో రమ్మను చున్నది.

7•
ఉన్నత సీయోనులోను / ప్రియమైన యేసుతోను
జీవించెదను సంతోషముగ /
ప్రార్థన ఇంటిలో నిత్యము

Leave a Comment