చూడుము ఈ క్షణమే కల్వరిని ప్రేమా ప్రభువు

చూడుము ఈ క్షణమే కల్వరిని ప్రేమా ప్రభువు

చూడుము ఈ క్షణమే కల్వరిని
ప్రేమా ప్రభువు నీకై నిలుచుండెను
గొప్ప రక్షణ నివ్వ శ్రీ యేసుడు
సిలువలో వ్రేలాడు చున్నాడుగా

1•
మానవు లెంతో చెడి పోయిరి
మరణించెదమని తలపోయక
ఎరుగరు మరణము నిక్కమని
నరకమున్నదని వారెరుగరు

2•
ఇహ మందు నీకు కలవన్నియు
చనిపోవు సమయాన వెంటరావు
చనిపోయినను నీవులేచెదవు
తీర్పున్నదని యెరుగు ఒక దినమున

3•
మనలను ధన వంతులుగ చేయను

దరిద్రుడాయెను మన ప్రభువు
రక్తము కార్చెను పాపులకై
అంగీకరించుము శ్రీ యేసును

4•
సిలువపై చూడుము ఆ ప్రియుని
ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు
అర్పించుకో నీదు జీవితము
అయన కొరకై జీవించుము

Leave a Comment