చూడరే మారేడు పుట్టి నాడు బేత్లహేములో

చూడరే మారేడు పుట్టి నాడు బేత్లహేములో

చూడరే మారేడు – పుట్టి /
నాఁడు బేత్లహేములో
= నేఁడీ భూమి వాసులకు /
నిండు రక్షణబ్బెను ॥చూడరే॥

1•
ఎన్నరాని దేవ దీప్తి /
మున్ను మిన్ను గ్రమ్మెను
= పన్నుగా రేయెండ కాంతి /
కన్ననది మించెను ॥చూడరే॥

2•
దూత తెల్పె వ్రేల కొక /
ప్రీతియగు ముచ్చటన్ /
ఖ్యాతిగ దావీదు పురిని-
కర్తయేసు పుట్టుటన్ ॥చూడరే॥

3•
తూరుపున జ్ఞానులొక్క/
తార దివిని గాంచిరి
= వారు వీరు వచ్చి సేవ/
వరుసగాను జేసిరి ॥చూడరే॥

4•
మక్కువతో మనమెల్ల /
మ్రొక్కి సేవఁ జేతము
= మిక్కుటముగ మనకు శాంతిఁ /
గ్రక్కున నొసంగును ॥చూడరే॥

జాన్ చౌధరి

Leave a Comment