చింత లేదిక యేసు పుట్టెను – వింతగను

చింత లేదిక యేసు పుట్టెను – వింతగను

చింత లేదిక యేసు పుట్టెను/
వింతగను బేత్లహేమందున
చెంతజేరను రండి సర్వజనాంగమా/
సంతస మొందుమా ॥చింత॥

1•
దూత దెల్పెను గొల్లలకు శుభవార్త
నాదివసంబు వింతగా
ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి/
స్తుతులొనరించిరి ॥చింత॥

2•
చుక్క గనుగొని జ్ఞానులెంతో/
మక్కువతో నా ప్రభుని గనుగొన
చక్కగా బేత్లము పురమున జొచ్చిరి/
కానుక లిచ్చిరి ॥చింత॥

3•
కన్య గర్భమునందు బుట్టెను /
కరుణ గల రక్షకుడు క్రీస్తుడు
ధన్యులగుటకు రండి వేగమే దీనులై/
సర్వమాన్యులై ॥చింత॥

4•
పాప మెల్లను పరిహరింపను/
పరమ రక్షకుడవతరించెను
దాపుజేరిన వారి కిడు గడు భాగ్యము/
మోక్షభాగ్యము   ॥చింత॥


రచన : యన్.డి. ఏబేల్

Leave a Comment