అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో

అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో

అందాల తార అరుదెంచె నాకై /
అంబర వీధిలో
అవతార మూర్తి ఏసయ్యా కీర్తి /
అవని చాటుచున్
ఆనంద సంద్ర ముప్పొంగె నాలో /
అమరకాంతిలో
ఆది దేవుని జూడ /
ఆశింప మనసు పయనమైతిని

1•
విశ్వాస యాత్ర దూరమెంతైన /
విందుగ దోచెను
వింతైన శాంతి వర్షించెనాలో /
విజయ పథమున
విశ్వాల నేలెడి దేవకుమారుని /
వీక్షించు దీక్షతో

2•
విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ /
విశ్రాంతి నొసగుచున్
యెరూషలేము రాజనగరిలో /
యేసును వెదకుచు
ఎరిగిన దారి తొలగిన వేళ యెదలోకృంగితి
యేసయ్య తార ఎప్పటి వోలె /
ఎదురాయె త్రోవలో
ఎంతో అబ్బుర పడుచు /
విస్మయ మొందుచు/ ఏగితి స్వామి కడకు

3•
ప్రభు జన్మస్థలము పాకయెగాని /
పరలోక సౌధమే
బాలుని జూడ జీవితమంత పావన మాయెను
ప్రభుపాదపూజ దీవెన కాగ/
ప్రసరించే పుణ్యము
బ్రతుకే మందిరమాయె /
అర్పణలే సిరులాయె/ఫలియించె ప్రార్థన

రచన : డా॥ ఏ.బి. మాసిలమణి

Leave a Comment