ఆకాశంలో అందాల తార వెలసింది
ఆకాశంలో అందాల తార వెలసింది –
భూలోకమంత – సంతోషంతో మురిసింది
ఈలోక రక్షకుడు ఉదయించేనని
తన ప్రజలను రక్షించుట కొరకు జన్మించెనని || ఆకా||
1•
చిన్ని బాలుడై పుట్టాడు పశుల పాకలో-
చిరు నవ్వులతో వెలిసాడు ఈ అవనిలో
చీకటి నుండి వెలుగులోనికి-
మరణం నుండి జీవంలోనికి –
నడిపించుటకై వెలిసాడు శ్రీ యేసుడు ||ఆకా||
2•
జ్ఞానులు వచ్చారు తమ-కానుకలు ఇచ్చారు-
దేవ దూతలు వెలిసారు-శుభవార్తను చెప్పారు
సంతసమొంది గొల్లలు శ్రీయేసుకు మ్రొక్కారు-
ఆ యేసే మన రక్షకుడని నమ్ముకున్నారు ||ఆకా||
రచన. రెవ. రమావత్ భీముడు నాయక్