ఆటంకమేలేదు చిన్నారులారా యేసయ్య చెంతకు

ఆటంకమేలేదు చిన్నారులారా యేసయ్య చెంతకు

ఆటంకమేలేదు చిన్నారులారా
యేసయ్య చెంతకు మీరంతా చేరా (2)
యేసయ్యతో సంతోష గానం
యేసయ్యలో సంతోష గానం (2)
అనవరతం మీకొరకే నిజ బహుమానం (2)
॥ఆటంకమేలేదు॥

1.
సమృద్ధిని పొందుకుని పాట పాడుతూ
ఒప్పుకోలు మనసుతో దేవుని వేడుతూ (2)
హృదయపూర్వక మనస్సుతో /
ఉత్సవ గీతాలతో (2)
విజయగీతము పాడ రండీ !
॥ఆటంకమేలేదు॥

2.
ఆనందం అందుకుని పాట పాడుతూ
గొప్పగీతముప్పొంగగ స్తుతులను సల్పుతూ (2)
ఆరాధన హృదయముతో /
సాక్ష్య గీతాలతో (2)
మహిమ గీతము పాడ రండీ ! (2)
॥ఆటంకమేలేదు||

Leave a Comment