ఆరాధింతును హల్లేలూయా ఆరాధింతును హల్లేలూయా

ఆరాధింతును హల్లేలూయా ఆరాధింతును హల్లేలూయా

ఆరాధింతును / హల్లేలూయా
ఆరాధింతును / హల్లేలూయా
యేసయ్యను – ఎల్లప్పుడు (2)
అందరిలో ఆరాధించి సేవింతును (2)

1.
ఎన్నడెన్నడు / లేని ఆనందం
ఎప్పుడెక్కడా / దొరకని ఆనందం (2)
యేసులోనే పొందుకున్నాను (2)
అందుకే నే ఆరాధింతును (2)
॥ఆరాధింతు॥

2.
జలములలో / నే నడచినప్పుడు
బలమై యున్న నాదు దేవుడు (2)
ఘనమైన నా యేసు దేవుని (2)
అందరిలో ఆరాధింతును (2)
॥ఆరాధింతు॥

3.
ఒంటరినై నే నుండి నప్పుడు /
కంటి పాపవలె నన్ను గాచెను (2)
కన్నీరంతయు తుడిచి యున్నాడు (2)
అందుకే నే ఆరాధింతును
॥ఆరాధింతు॥

Leave a Comment