ఆదినము సమీపించెను ఆయత్తమై ఎగిరిపోదుము
ఆదినము సమీపించెను /
ఆయత్తమై ఎగిరిపోదుము
ఈ అరణ్య యాత్ర ముగించి /
యేసుతోడ జీవించెదమ్
పల్లవి :
దేవుడు వచ్చు చుండెత్వరగా వచ్చుచుండె
ప్రభు సమయము మనం గ్రహించెదము
భక్తులు అందరు మేల్కొందురు ||దేవుడు||
1•
దొంగలాగ ఆయనవచ్చును /
తీవ్రముగా ఆది సమీపించును
ఆయత్తము లేక అవనిలో ఉన్నవారు /
ఏడ్చిరోదన చేయుదురు ॥దేవుడు॥
2•
చీకటి వచ్చువేళ సమీపించు /
ఇంక వేరేకాలము మనకులేదు
పూర్ణులముగా సాగెదము /
దేవునితో నిత్యము నివసించెదము ॥దేవుడు॥
3•
పెండ్లి కుమారుని స్వరము విని /
మహిమలో మనము చేరెదము
పరిశుద్ధాత్మలో నిండి జీవించి /
పరమరాజ్యము చేరెదము ||దేవుడు||
4•
తలంచనివేళలో వచ్చును /
నిద్రమైకమును విడనాడెదమ్
నీతిరాజుని ముఖాముఖిగా /
మనము నిత్యము దర్శించెదం ॥దేవుడు॥