ఆ తూరుపు దేశములో రాత్రివేళలో
ఆ తూరుపు దేశములో / రాత్రివేళలో
గొర్రెల కాపరులు / మందను కాయగా
హ్యపీ హ్యపీ క్రిష్ణస్ / మెర్రి మెర్రి క్రిస్మస్
1•
ఒక దూత నిలిచెను /
ప్రభువు మహిమ/ ప్రకాశించెను /
వారు భయపడిరి, వారు భయపడిరి ॥హ్యపీ॥
2•
అయితే ఆ దూత /భయపడకండని చెప్పి
సువార్తమానము / చెప్పెద నేననెను॥హ్యపీ॥
3•
దావీదు పట్టణములో రక్షకుడు మీ కొరకు
పశువుల పాకలో / జన్మించియున్నాడు॥హ్యపీ॥
4•
ఆయనే యేసయ్యా / ప్రభువైన మెస్సయ్యా
లోక పాపములు / పారిపోయెను ॥హ్యపీ॥
రచన: బ్ర॥ యెహోషువ కమలాకర్